త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

Date:22/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడికి అనుబంధంగా ఉన్న‌ త‌రిగొండలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో శ‌నివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 2 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం, మార్చి 7న క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌, మార్చి 8న‌ ర‌థోత్స‌వం, మార్చి 9న పార్వేట ఉత్స‌వం, మార్చి 10న చ‌క్ర‌స్నానం, మార్చి 11న పుష్ప‌యాగం జ‌రుగుతాయ‌ని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   ఎల్ల‌ప్ప‌, డెప్యూటీ ఈవోలు   క‌స్తూరి,   గోవింద‌రాజ‌న్, సూపరింటెండెంట్‌  చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

వాహ‌న సేవ‌ల వివ‌రాలుః

తేదీ ఉదయం సాయంత్రం

02-03-2020 (సోమ‌వారం) ధ్వజారోహణం హంస వాహనం

03-03-2020 (మంగ‌ళ‌వారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం

04-03-2020 (బుధ‌వారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

05-03-2020 (గురువారం) తిరుచ్చి వాహనం పెద్దశేష వాహనం

06-03-2020 (శుక్ర‌వారం) తిరుచ్చి వాహనం గజ వాహనం

07-03-2020 (శ‌నివారం) తిరుచ్చి వాహనం సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం మరియు గరుడ సేవ

08-03-2020 (ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం

09-03-2020 (సోమ‌వారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం మరియు అశ్వవాహనం

10-03-2020 (మంగ‌ళ‌వారం) వసంతోత్సవం, చక్రస్నానం తిరుచ్చి ఉత్స‌వం, ధ్వజావరోహణం.

పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

Tags: Unveiling the wallpapers of Lord Lakshminarasimha Swamy’s Brahmots

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *