తెలంగాణలో ఉపఎన్నికలు

Date:15/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
విధి వైప‌రీత్య‌మో.. భావోద్వేగ‌మో.. యాదృచ్ఛిక‌మో.. ఏదైనా.. పాపం తెలంగాణ కాంగ్రెస్‌కు గ‌డ్డుకాలం మొద‌లైంద‌నే చెప్పాలి. శాస‌న‌స‌భ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి అడ్డుత‌గిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.. హెడ్‌ఫోన్ విస‌రికొట్ట‌డం.. అది కాస్తా.. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి త‌గలి గాయ‌మైంది. దీంతో ర‌చ్చ మొద‌లైంది. అప్ప‌టికే కాంగ్రెస్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు సిద్ధంగా వున్న టీఆర్ఎస్ అనుకోని అవ‌కాశాన్ని తెలివిగా.. అదీ రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఉప‌యోగించింది. న‌ల్లగొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌ల‌పై వేటు వేసింది. ఈ మేర‌కు శాస‌న‌స‌భ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుద‌ల చేసింది. రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఖాళీ అయిన‌ట్లుగా.. ఉప ఎన్నిక‌లు జ‌ర‌పాల్సిందిగా ఎన్నిక‌ల సంఘానికి ఇప్ప‌టికే స‌మాచారం పంపారు. కేవ‌లం ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో టీఆర్ఎస్ ఎంత వేగంగా క‌ద‌లటం పాపం హ‌స్తం పార్టీకు మింగుడు ప‌డ‌కుండా ఉంది.. ప‌నిలో ప‌నిగా మ‌రో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై కూడా వేటు వేసే అవ‌కాశాలున్నాయంటూ సంకేతాలు పంపింది. దీనిపై కాంగ్రెస్ గాంధీభ‌వ‌న్ వ‌ద్ద 48 గంట‌లు నిర‌స‌న తెలియ‌జేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయించి ఎన్నిక‌లు జ‌ర‌పాలంటూ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్య మొద‌లైన స‌మ‌రం.. ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు. కాంగ్రెస్ న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌వుతోంది. హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసేందుకు న్యాయ‌నిపుణుల‌ను కూడా సంప్ర‌దించారు. గొడ‌వ జ‌ర‌గ‌టం.. అనుకోని విధంగా స‌భ‌లో దాడి చేయ‌టం.. వంటివి కాంగ్రెస్‌కు ప్ల‌స్సా, మైన‌స్సా అనే లెక్క‌లు కూడా వేస్తున్నారు. టీఆర్ఎస్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు.. ఇదే స‌రైన స‌మాధాన‌మంటూ ఓ వ‌ర్గం మెచ్చుకుంటుంటే.. కాదు.. ఇది రాజ్యాంగ విరుద్ధం.. నిర‌స‌న తెలిపేందుకు శాంతియుతం మార్గం ఉండ‌గా.. కావాల‌నే కోమ‌టిరెడ్డి.. ఓవ‌రాక్ష‌న్ చేశారంటూ సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు మొద‌ల‌వ‌టం.. కాంగ్రెస్‌కు మింగుడుప‌డ‌కుండా ఉంది.
Tags: UPA elections in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *