జీవిత షేర్లను ఉపాసన కొనుగోలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సినీ ఇండస్ట్రీలో జరిగే లావాదేవీలు, సెలెబ్రిటీల వ్యాపార లాభనష్టాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చలు నడుస్తుంటాయి. తారల వ్యక్తిగత జీవితాల మీద అందరికీ ఎక్కువగా శ్రద్ద ఉంటుంది. అలా తాజాగా ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.జీవిత రాజశేఖర్ ఆస్థిని ఉపాసన కొనాలనే ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఇక జీవిత రాజశేఖర్ ఆస్తి విలువ ఇంత అని అంత అని, ఉపాసన త్వరలోనే కొనుగోలు చేయనుందని రకరకాల గాసిప్పులు పుట్టుకొస్తున్నాయి. జీవిత రాజశేఖర్‌లకు ఫిల్మ్ నగర్‌లో దాదాపు 200 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఉందని సమాచారం. అయితే ఇందులో వేరే సంస్థల వాటా కూడా ఉందట. కానీ జీవిత రాజశేఖర్‌లకు తమ షేర్ కింద రూ 200 కోట్లు ఉందని తెలుస్తోంది. అయితే వాటిని అమ్మేసి వేరే చోట మరో ప్రాపర్టీని కొనాలని ప్రయత్నిస్తున్నారట. ఈ ప్రాపర్టీని ఉపాసన చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారట.జీవిత రాజశేఖర్ ప్రాపర్టీలోనే హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు, ఎన్టీఆర్ వంటి వారికి కూడా షేర్లున్నాయని తెలుస్తోంది. కానీ జీవిత రాజశేఖర్‌లు మాత్రం తమ ప్రాపర్టీని అమ్మేయాలనే ఆసక్తితోనే ఉన్నారని, ఆ తరువాత విప్రో సర్కిల్ వద్ద వేరే ఆస్తిని కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. అయితే ఈ వ్యవహారం మరి ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో చూడాలి. అసలే ఇప్పుడు మా ఎన్నికల వ్యవహారం ఫుల్ హీటెక్కి ఉంది. ఇలాంటి తరుణంలో జీవిత రాజశేఖర్ ప్రాపర్టీలు అమ్మడం, కొనుగోలు చేయడం వంటివి మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Upasana purchase of life shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *