Uppal Stadium for the Windies match

విండీస్ మ్యాచ్ కు అంతా ఉప్పల్ స్టేడియం

Date:05/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో  భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టీ20 మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్ (హెచ్‌సీఏ) తెలిపింది. అలాగే మ్యాచ్ జరిగే స్టేడియంలో వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) మహేశ్ భగవత్ తెలిపారు. గురవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్, సీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడతూ..ఈ మ్యాచ్‌కు 40 వేల మంది అభిమానులు హాజరయ్యే అవకాశముందని తెలిపారు. అయితే రేపు బ్లాక్ డే కూడా ఉన్న నేపథ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇందుకోసం 1,800 మంది పోలీసులను మ్యాచ్ కు బందోబస్తు కొరకు నియమిస్తున్నారు. ఆక్టోపస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సిసి కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు డాగ్ స్క్వాడ్ టీం, భారీ బందోబస్త్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉంటుందని తెలిపారు. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. అంతే కాకుండా క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు వినియోగ సమయాన్ని కూడా పెంచామని తెలిపారు.

 

 

 

 

 

 

మెట్రో రైల్ రాత్రి 1 గంట వరకు పనిచేస్తుందని తెలిపారు.భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని వస్తువులను స్టేడియానికి తీసుకురాకుండా నిషేధించామని సీపీ భగవత్ తెలిపారు. సిగరెట్లు, ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్థాలు, పెన్స్, ఫర్ ఫ్యూమ్స్ స్టేడియంలోకి తీసుకురాకుండా బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం క్రికెట్ అభిమానులు తమతో సహకరించాలని కోరారు. అలాగే స్టేడియంలోకి జాతీయ జెండాను తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవని గుర్తుచేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి షీ టీం బృందాలు కూడా రక్షణ కోసం నియమించామని తెలిపారు.మ్యాచ్ వేదికైన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం మొత్తం కూడా సిసి కెమెరాల ఆధీనంలో ఉంటుందని సీపీ తెలిపారు. ప్రేక్షకులకు తక్షణ వైద్య సేవ కోసం అంబులెన్సులను 3 నుంచి 8 వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫైరింజన్‌లను నాలుగు నుంచి ఐదు వరకు అందుబాటులో ఉంచామని అన్నారు. మరోవైపు ప్రేక్షకులు, బందోబస్తులో ఉన్న వ్యక్తుల కోసం నీళ్ల సదుపాయం కల్పించామని తెలిపారు. మరోవైపు దొంగతనాలు లాంటి సంఘటనలు లేదా ఎవరికైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా డయల్ 100 కి ఫోన్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు.

 

హడావిడిగా హస్తినకు జగన్

 

Tags:Uppal Stadium for the Windies match

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *