Natyam ad

మళ్లీ యురేనియం కలకలం

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:


నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలో మళ్లీ యురేనియం కలకలం రేగింది. అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బోర్లు వేసేందుకు వచ్చిన వాహనాన్ని అడ్డుకొని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమకు ఎలాంటి సమాచారమివ్వకుండా మహారాష్ట్రకు చెందిన ఓ బోరుబండితో డ్రిల్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డ్రిల్‌ చేసిన బోరు బండితోనే మట్టిని పూడ్చివేయించి ఆ వాహనాన్ని వెనక్కి పంపించివేశారు స్థానికులు. 2011లో ఓసారి తమ పొలాల్లో పరిశోధనలు చేశారని.. మట్టి నమూనాలను తీసుకెళ్లారంటున్నారు గ్రామస్తులు. అయితే, బీకే తిర్మలాపూర్‌  గ్రామ సర్పంచ్‌ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాలలో మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేటు బోరుబండితో డ్రిల్‌ చేస్తుండగా గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. ఎవరికి చెప్పకుండా ఎందుకు బోరు వేస్తున్నారని ప్రశ్నించారు. అలా మాటమాట పెరింగింది. దీంతో డ్రిల్ వేస్తున్నవారిని గ్రామస్థులు అడ్డుకున్నారు.గ్రామంలో వాటర్‌ లెవల్‌ టెస్టింగ్‌ కోసమే ఈ బోర్‌ను వేస్తున్నట్లు ఎంపీడీవో రామ్మోహన్‌, జిల్లా వాటర్‌ లెవల్‌ అధికారి రమాదేవిలు నచ్చచెప్పినా గ్రామస్థులు వినలేదు. మంచినీటి కోసం పాఠశాలలో బోరు వేయాలనుకుంటే తమకు ముందస్తుగా సమాచారం.

 

 

 

ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.వాటర్‌ లెవల్‌ టెస్టింగ్‌ కోసం జిల్లాలో వివిధ చోట్ల బోర్లు వేస్తున్నామని అధికారులు చెప్పినా వారు నమ్మకపోవడంతో కొంత సేపు గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రిల్‌ చేసిన బోరుబండితోనే తిరిగి డ్రిల్లింగ్‌ చేసి మట్టిని పూడ్చి వేయించారు. తోడిన మట్టిన పూడ్చిన తర్వాత వాహనాన్ని గ్రామం నుంచి పంపించారు. గ్రామంలో వాటర్‌ లెవెల్‌ టెస్టింగ్‌ కోసమే బోరును వేస్తున్నట్టు తెలిపారు అధికారులు. అయినా సరే శాంతించని గ్రామస్తులు..తమకు ముందుస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఫైరయ్యారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.గతంలో మాదిరి ఇప్పుడు కూడా చేస్తు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు గ్రామస్థులు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాసరయ్య ఆరోపించారు. ప్రభుత్వం మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ ప్రాంత ప్రజ లతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Uranium mix again

Post Midle