ప్రజల సహకారంతోనే పట్టణాభివృద్ధి

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మాణాలు చేపట్టాలి
జులై 1 నుంచి 10 వరకు హరితహారం, పట్టణ ప్రగతి
8,14.వ వార్డుల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి ఆకస్మిక తనిఖీ

జగిత్యాలముచ్చట్లు :

 

 

ప్రజల సహకారంతోనే జగిత్యాల పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి- ప్రవీణ్ అన్నారు. రాబోయే వర్షాకాలంలో జగిత్యాల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకునేందుకుగాను మంగళవారం ఛైర్ పర్సన్ శ్రావణి అధికారులు, కౌన్సిలర్ లతో కలసి 8,14 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ గత వర్షాకాలంలో పట్టణంలోని  వివిధ ప్రాంతాల్లో వరదల్తో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఈ సారీ అలా జరుగకుండా ఉండేందుకు వార్డుల వారీగా ఏఏ చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని అధికారులను అదేశించేందుకు వచ్చామని తెలిపారు. 14 వ వార్డులో గత 50 సంవత్సరాలుగా డ్రైనేజి  సమస్యతో  ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజి నిర్మాణానికి కౌన్సిల్ నిధులు మంజూరు చేసిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజలు దీనిగురించి హర్షిస్తున్నారని  వివరించారు.

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మాణాలు చేపట్టాలని, సెట్ బ్యాక్ వదిలిపెట్టాలని శ్రావణి సూచించారు.రోడ్లు ఇరుకుగా ఉంటే ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు రావడానికి ఇబ్బందులుంటాయని, ఇంటి యజమానులు తప్పకుండ సెట్బ్యా క్ వదలలాని పునరుద్దటించారు. జులై 1 నుంచి 10 వరకు ఏడవ విడత హరితహారం కార్యక్రమం చెప్పట్టి పెద్దఎత్తున మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. అలాగే ఈ రోజుల్లోనే 3 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతామని దీనికి ప్రజలు సహకరించాలని శ్రావణి కోరారు. 14 వార్డులో ఉన్న సమస్యను వర్షాకాలం రాబోతున్నందున నడవడానికి విలులేని రోడ్డులో మొరం వెంటనే చేపట్టాలని కమిషనర్ మారుతీ ప్రసాద్ ను ఆదేశించారు. 8,14 వార్డుల్లో  ప్రజలు సూచించిన పనులను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపడుతామని శ్రావణి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, కౌన్సిలర్లు వారణాసి మల్లవ్వ , కూతురు పద్మ, సానిటరీ ఇన్స్పెక్టర్లు రాము, మహేశ్వర్ రెడ్డి, అశోక్, నాయకులు కూతురు శేఖర్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Urban development with the cooperation of the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *