ప్రజాసహకారంతో పట్టణ ప్రగతి సాధ్యం-జిల్లా కలెక్టర్  జి.రవి

జగిత్యాల ముచ్చట్లు:

 

ప్రజాసహకారంతో మాత్రమే పట్టణ ప్రగతి  సాధ్యమవుతుందని  జిల్లా కలెక్టర్ జి.రవి   తెలిపారు. గురువారం  మెట్ పెల్లి మున్సిపాల్టీ పరిధి లోని 11వ వార్డులో మరియు  12వ  వార్డులో ఏర్పాటు చేసిన  పట్టణ ప్రగతి  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి, ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్  రావులు హజరై జూలై 1, 2021 నుంచి జూలై 10, 2021 వరకు  ప్రభుత్వం నిర్వహిస్తున్న 3వ విడత  పట్టణ ప్రగతిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని,  ప్రజాభాగస్వామ్యంతో పట్టణ అభివృద్దికి  అడుగులు వేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలటి లలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక అధికారి, సదరు వార్డు  కౌన్సిలర్, వార్డు కమిటి సభ్యులతో కలిసి  ప్రతి వార్డులో  10 రోజుల పాటు పట్టణ ప్రగతి  కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

 

 

 

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో ఉన్న సమస్యలను,  నిర్మాణ వ్యర్థ పదార్థాలను, చెత్త  ప్రదేశాలను , నిరుపయోగమైన  బావులు,  కూలిపొయిన ఇండ్ల వ్యర్థాలను గుర్తించి వాటి తొలగింపు దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  పట్టణాలలో ఉన్న పిచ్చి మొక్కలను,  పొదలు, తుప్పలను పూర్తి స్థాయిలో తొలగించాలని, ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశుభ్రం చేసుకోవాలని  కలెక్టర్ సూచించారు.  మున్సిపాల్టీ వ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మున్సిపాల్టీ శుభ్రం చేయాలని,  దానికి అయ్యే వ్యయం సదరు   భూ యాజమాన్యుల నుంచి  వసూళ్లు చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.

 

 

 

7వ విడత   హరితహారం   కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో  మొక్కలు  నాటడానికి అనువైన స్థలాలను గుర్తించాలని,  ఇంటింటి సర్వే చేపట్టి  అవసరమైన మొక్కల వివరాలు  సేకరించాలని,  పచ్చదనం పెంపొందించే దిశగా  హరిత  ప్రణాళిక  రుపొందించుకోవాలని కలెక్టర్ అన్నారు.  గ్రామాలో  పారిశుద్ద్యం  కొంత మెరుగుపర్చుకున్నప్పటికి  పట్టణ ప్రాంతంలో మరింత  శ్రద్దగా  పారిశుద్ద్యం నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్  తెలిపారు. పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించి  అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్  సూచించారు.  ప్రతి ఇంటికి అవసరమైన మొక్కల పంపిణీ పూర్తి చేయాలని  తెలిపారు.

 

 

 

మెట్ పెల్లి మున్సిపాల్టీలో  పెద్ద ఎత్తున  అవెన్యూ ప్లాంటేషన్  చేపట్టాలని,  రొడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని  కలెక్టర్  తెలిపారు.   ప్రభుత్వం నాటిన మొక్కలను   కొంతమంది  షాపు ఓనర్లు తొలగిస్తున్నట్టు సమాచారం అందుతుందని,     ప్రస్తుతం అలా ఎవరైన తొలగిస్తే  భారీ జరిమానా వసూళ్లు చేయాలని, సదరు మొక్కల సంరక్షణ బాధ్యత  ఇంటి వారికి లేదా సదరు వాణీజ్య  షాపు ఓనర్లకు అందించాలని  కలెక్టర్  తెలిపారు.  పట్టణాలలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి  ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే  హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా  చర్యలు తుకోవాలని   అన్నారు.   పట్టణ ప్రగతిలో భాగంగా ప్లాస్టిక్ నిషేదం, పందుల నివారణ, తడి చెత్త , పొడి చెత్త  వంటి అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

 

 

 

పట్టణాలలో ప్రజల అవసరాల మేరకు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసామని  తెలిపారు. ప్రతి పట్టణంలో వైకుంఠదామం,  ఏకీకృత  మార్కెట్  ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు.   మెట్లపల్లి పట్టణంలో  సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన ఇటీవల చేసామని, సదరు పనులు త్వరగా పూర్తి చేస్తామని, అదే విధంగా  వైకుంఠదామం  సైతం ఏర్పాటు చేస్తామని  తెలిపారు. పట్టణాలలో చెత్త నిర్వహణకు సంబంధించి   డంపింగ్ యార్డు ఏర్పాటుకు  అవసరమైన స్థల సేకరణ వంటి పనలు పూర్తి చేయాలని  కలెక్టర్ అన్నారు.  పట్టణ ప్రగతి  కార్యక్రమంలో భాగంగా  వార్డు కమిటిల సమావేశం ఏర్పాటు చేసి సదరు వార్డు అభివృద్దికి సంబంధించి ప్రణాళికలు రుపొందించాలని  కలెక్టర్ అన్నారు.  ప్రతి మున్సిపాల్టీలో చేపట్టాల్సిన అభివృద్ది పనులకు సంబంధించి   ప్రణాళికలు సిద్దం చేసుకున్న తరువాత   ప్రభుత్వం నుంచి మున్సిపాల్టీలకు వచ్చే  నిధులు, మున్సిపాల్టీ సొంత ఆదాయ మర్గాలు ,  మున్సిపాల్టీకి  అయ్యే తప్పనిసరి ఖర్చులు(జీతాలు, అప్పులు, కరెంట్ బిల్లు, నీటి సరఫరా బిల్లు, 10% గ్రీన్ బడ్జెట్)  మినహాయించి అందుబాటులొ ఉన్న  నిధులతో   ప్రాధాన్యత క్రమంలోని అభివృద్ది కార్యక్రమాలను వెంటనే ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని , మిగిలిన అభివృద్ది పనుల కొరకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్దం చేసి నిధుల కొరకు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Urban progress possible with public cooperation – District Collector G. Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *