లోతట్టు ప్రాంతాల్లో ఆర్బన్ ఎస్పీ పర్యటన

Date:26/11/2020

చిత్తూరు ముచ్చట్లు:

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి  జిల్లా వ్యాప్తంగా ప్రమాదపు హెచ్చరికలో ఉన్న ప్రాంతాలను పరిశీలించి అక్కడ సిబ్బందికి ఎప్పటికప్పుడు సహాయ చర్యలపై సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి పోలీస్ అధికారులకు, సహాయ బృందాలకు పలు సూచనలు చేసి ప్రజలను అప్రమత్తం చేసారు. ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24×7 అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంత పరిధి వంకలు, వాగులు ప్రవహించు, లోతట్టు ప్రాంతంలో నివసించు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలి.   నదులు, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు మరియు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండేలా చర్యలు రెవిన్యూ అధికారుల సహాయంతో చర్యలు చేపట్టాలని అయన సూచించారు.
బలమైన గాలులు వీస్తున్నాయి కాబట్టి పాత ఇండ్లు, రేకుల షెడ్డులు, భోద ఇండ్లు మొదలగు వాటిని గుర్తించి అక్కడ నివసించే వారిని అప్రమత్తం చేసి వారికి కావలసిన సదుపాయాలను సకాలంలో సమకూర్చాలి.   జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నివర్ తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక బృందాలను సిధ్దంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నాయి.    నివర్ తుఫాన్ వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇబ్బందులుకు గురైనా ప్రజలు వెంటనే డయల్ – 100 లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 8099999977 కు సమాచారం తెలిపితే సహాయ చర్యలు చేయడానికి తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాగం 24×7 అందుబాటులో వుంటుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని  అయన అన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Urban SP tour in the hinterland

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *