Natyam ad

పుంగనూరులో ఉర్ధూపాఠశాల నిర్మాణ పనులు ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని రాంపల్లె గ్రామంలో ఉర్ధూపాఠశాల నిర్మాణ పనులకు బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. భూమిపూజా కార్యక్రమాన్ని ఎంపీడీవో రామనాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మైనార్టీలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతంలో ఉర్ధూపాఠశాలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంజూరు చేశారని తెలిపారు. పనులు వెంటనే పూర్తి చేసి పాఠశాలను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మంత్రి పీఏ చంద్రహాస్‌, కోఆఫ్షన్‌ మెంబరు మహబూబ్‌బాషా, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, సుబ్రమణ్యం, రమణ,  మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Urdu school construction work has started in Punganur

Post Midle