Natyam ad

ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

న్యూ డిల్లీ  ముచ్చట్లు:

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. అయితే, హమాస్‌కు ఇరాన్‌ సహకారం అందిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయం, అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌ను జాగ్రత్తగా ఉండాలని బైడెన్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రధానిబెంజిమన్‌ నెతన్యాహూతో బుధవారం మాట్లాడినట్లు తెలిపారు. యుద్ధ నిబంధనల ప్రకారం ఏవైనా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.నెతన్యాహు 40 ఏళ్లుగా తనకు తెలుసునన్నారు.ఇజ్రాయెల్‌ కోపం, నిరాశ సమయంలోనూ యుద్ధ నిబంధనల ప్రకారం అడుగులు వేస్తుందన్నారు. హోలోకాస్ట్ తర్వాత యూదులకు ఇది అత్యంత ఘోరమైన ఘటన అని, ఇజ్రాయెల్‌ శక్తి మేరకు ప్రతిదీచేస్తుందన్నారు. హమాస్‌ దాడులను అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మరో వైపు అమెరికా పౌరులకు యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. గాజా వైపు వెళ్లొద్దని, ఈ
విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది.

 

Post Midle

Tags: US President Joe Biden gave a warning to Iran

Post Midle