వర్షానికి కూలిన ఉసేన్ స్వామి దర్గా గోడ

తుగ్గలి ముచ్చట్లు:

 

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాతన గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఉసేన్ స్వామి దర్గా వెనక భాగంలో ఉన్న గోడ పూర్తిగా నేలమట్టం అయింది.రాతన గ్రామంలో చెరువు కట్టకు అనుకొని నిర్మిస్తున్న ఉసేన్ స్వామి దర్గాకు గ్రామస్తులు మరియు దాతల విరాళాలతో దాదాపు మూడు లక్షల వ్యయంతో గ్రామ ప్రజలు ఈ దర్గా ను నిర్మించారు.మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి దర్గా కు వెనుక భాగంలో ఉన్న గోడ రాత్రి 12 గంటల సమయంలో గోడ పూర్తిగా కూలినట్లు గ్రామస్తులు తెలియజేశారు.రాత్రి పూట గోడ కూలడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని గ్రామస్తులు తెలియజేశారు.విషయం తెలుసుకున్న రాతన సర్పంచ్ రాచప్ప,వైసిపి నాయకులు ఎర్రి స్వామి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.దర్గా వెనుకభాగం ఉన్నా గోడ తో పాటుగా,దర్గా ప్రహరీ గోడ,దర్గా లోపలి భాగం,దర్గా వెనుక ఉన్న విద్యుత్ స్తంభం పూర్తిగా ధ్వంసం అయ్యాయని వారు తెలియజేశారు.వర్షానికి కూలిన దర్గాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి దర్గా గోడ నిర్మాణానికి సహకరించాలని గ్రామస్తులు తెలియజేశారు. దర్గా గోడ,తదితర వాటిని పునర్నిర్మించడానికి చాలా మొత్తం అవసరం అవుతుందని,ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని గ్రామస్తులు తెలియజేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Usain Swami Dargah wall collapsed due to rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *