పుంగనూరులో ఓటిఎస్ను వినియోగించుకోండి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని దీర్ఘకాలిక బకాయిలు కలిగిన వారందరు ఓటిఎస్ పథకంలో రుణవిముక్తులు కావాలని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. శుక్రవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు కొండవీటి నటరాజ, జయకుమార్ యాదవ్, భారతి తో కలసి 10వ వార్డు సచివాలయంలో ఓటిఎస్ క్రింద జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు తక్కువ వెహోత్తాలు చెల్లించి రుణ విముక్తులు కావాలన్నారు. దీని ద్వారా పేద ప్రజల ఇండ్లపై ఎలాంటి అప్పు లేకుండ వారికి సర్టిఫికె ట్లు అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంఎం.ఆనంద, ఖాన్, మహమ్మదాలి, చిన్నా, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: Use OTS in Punganur
