శ్రీవారి దర్శనానికి ఆర్టీసిని వినియోగించుకోండి – మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సఫ్తగిరి ఆర్టీసి సర్వీసులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి తిరుమలకు రెండు నూతన ఆర్టీసి సర్వీసులను ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గ ప్రజల సౌకర్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు పుంగనూరులో ఆర్టీసి డిపో ప్రారంభించామన్నారు. ఈ డిపో నుంచి అన్ని ప్రాంతాలకు ఆర్టీసి బస్సులు నడుపుతూ పుంగనూరు నుంచి ప్రజలకు ఆర్టీసి సేవలు అందిస్తున్నామన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి టికెట్ల బుకింగ్ సౌకర్యం కూడ కల్పించి రానుపోను సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సేవలు ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి అధికారులు జితేంద్రరెడ్డి, సుధాకరయ్య, వైఎస్సార్ ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ అమ్ము, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Use RTC for Srivari Darshan – Minister Dr. Peddireddy Ramachandra Reddy
