ప్రాథమిక పాఠశాలల విభజనను విరమించుకోవాలి యుటిఎఫ్

-నూతన విద్యా విధా నం పేరుతో ప్రాథమిక విద్యను నాశనం చేయొద్దు
గోనెగండ్ల

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్‌ 172 ప్రకారం మన గ్రామాల్లో  1 నుండి 5 తరగతుల వరకు కొనసాగుతున్న బడులు కనుమరుగయ్యే అవకాశం ఉందని యుటిఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షులు కె.సురేష్ కుమార్ అన్నారు.గురువారం స్థానిక మండల కేంద్రంలో యుటిఎఫ్ మండల అధ్యక్షుడు:యస్.నరసింహులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జె.యల్లప్ప మాట్లాడుతూ మన ఊరి బడిని మనం కాపాడుకుని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత   పిలుపునిచ్చారు.రెండేళ్ల నుంచి మన ఊర్లలోని మనబడిలో చాలా మార్పులు వచ్చాయి.నాడు-నేడు పనులతో బడులు చూడముచ్చటగా మారాయని,విద్యా కానుకగా బడి సంచిలో పిల్లలకు కావల్సినవన్నీ ఇచ్చారు,బడికి పిల్లలు పంపుతున్నందుకు తల్లికి 15000 అమ్మ ఒడి కింద ఇచ్చారు.దీంతో బడుల్లో పిల్లల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఎల్‌కెజి, యుకెజి చదువులు కూడా మనబడిలోకి తెస్తామంటుంది. దీంతో మనబడి మరింతగా బలపడుతుంది.
కానీ మన బడి నుంచి 3,4,5 తరగతుల పిల్లల్ని దూరంగా ఉండే హైస్కూల్‌కు పంపుతామంటున్నారని అన్నారు.ఇప్పటిదాకా ఐదు తరగతులున్న మన ఉరి బడిలో 1,2 తరగతులు మాత్రమే ఉంచుతారు,మిగిలిన 3,4,5 తరగతులకు చెందిన పిల్లలు మనకు మూడు,ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే బడికి వెళ్లి చూడవుకోవాలి.

 

 

 

8 సంవత్సరాల పిల్లలు వేరే బడికి,వేరే ఊరికి వెళ్లి చదువుకునే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి…  కాబట్టి మన ఊరి బడి మన ఊరిలో లేకుండా పోతుందన్నారు.కావున మనమందరం కలిసి మన ఊరి బడి మన ఊరిలోని వుండేలాగునా…
మన ఊరి బడిలోనే మన పిల్లలు చదువుకునేలా కాపాడుకొందాం…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(APUTF)ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలను నాశనం చేయడానికి పుట్టుకొచ్చిన 172 జీవో నంబరును రద్దు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు మరియు అనేక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ఇంతటితో ఆగకుండా 172 జీవో రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు…
ఈ సమావేశంలో యుటిఎఫ్ నాయకులు బి. రాఘవేంద్ర,అక్బర్,చంద్రపాల్,పద్మ,నాయక్,నాగేశ్వరరావు, ప్రసాద్,రాజు,పాపయ్య, అశోక్,దేవపాల్,రామచంద్ర,విజయ్ మొదలగువారు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags; UTF should withdraw the division of primary schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *