సంక్షేమ పథకాల సద్వినియోగం : కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి

Date:13/04/2018
జనగామ ముచ్చట్లు:
గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సూచించారు. శుక్రవారం నాడు గ్రామ అభ్యుదయ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో అభ్యుదయ కార్యక్రమానికి అయన హజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రభుత్వం అందించే సబ్సిడీ లను పొందాలంటే ఖాతాలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సలీమ్, ఎంపిడిఓ సత్యాజనేయ ప్రసాద్, డి.ఎస్.ఓ రుక్మిణి దేవి, ఈజిఎస్ ఇంజినీర్ లింగయ్య, ఐ సీ డీ ఎస్ అధికారి పద్మజా రమణ, ఏపీఓ రాజకరుణ, తదితరులు పాల్గొన్నారు.
Tags:Utilization of welfare schemes: Collector Vinay Krishna Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *