Natyam ad

పేకాట క్లబ్బులు, మూడుముక్కలాటలు, మద్యం సిండికేట్,అక్రమ చేపల చెరువులు, కల్తీ సారార, లాడ్జి వ్యాపారాలు పెట్టింది ఉత్తమ్, చందర్ రావు లు.

ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

 

సూర్యాపేట ముచ్చట్లు:

 


కోవర్ట్ రాజకీయాలకు ప్రతినిధులు వేనేపల్లి చందర్రావు, ఉత్తంకుమార్ రెడ్డిలని కోదాడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం అనంతగిరి మండలం   శాంతినగర్ లోని  శశిధర్ రెడ్డి నివాసంలో ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 29న సీఎం కేసీఆర్  ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోదాడ నియోజకవర్గంలో రాజకీయ వర్తమాన పరిస్థితులపై ఆయన ఘాటుగా స్పందించారు, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అధికారంలో ఉండి ప్రజాధనాన్ని సూట్ కేసులు నింపుకొని పోయింది ఉత్తమ్ కాదని, ఉత్తం అవినీతి ఎవరికి తెలియదని దుయ్యబట్టారు. కోదాడలో పేకాట క్లబ్బులు,  మూడుముక్కల ఆట, మద్యం సిండికేట్ , చేపల చెరువు, పిచ్చి సారా,లాడ్జి వ్యాపారాలు నడిపింది ఉత్తం కాదని మండిపడ్డారు.గత ఐదేళ్లలో కోదాడ నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండి ఎంతో అభివృద్ధి చేశానన్నారు. దేశానికే ఆదర్శంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు గడపగడపకు అందుతున్నాయి అన్నారు. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య భీమా పథకం పేదలకు ఎంతో భరోసా అన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ, అధికారనికి దూరమైన కొంత మంది స్థానిక శాసనసభ్యులపై దుష్ప్రచారాలు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సర్వేలు కోదాడ నియోజకవర్గంలో చేయించి అన్ని సర్వేల్లో ప్రజల వెంట ఉన్న బీసీ నేత మల్లయ్య యాదవ్ కు మంచి పేరు ఉందని గుర్తించి మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించారన్నారు. పార్టీలో పదవులు పొంది అనుభవించి పార్టీని వీడిన వారిని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులకు సీఎం కేసీఆర్ తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు.

 

 

Post Midle

కోదాడ నియోజకవర్గంలో శశిధర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో విద్యాసంస్థలను అమ్ముకొని ఉద్యమాన్ని నిలబెట్టారన్నారు. అసంతృప్తిలో ఉన్న శశిధర్ రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష లక్ష్మీనారాయణను మంత్రి కేటీఆర్ కెసిఆర్ లతో మాట్లాడించి పార్టీ మారకుండా వారు మనసు మార్చుకొని బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ గెలుపు కోసం కృషి చేస్తారని ప్రకటించారన్నారు.శశిధర్ రెడ్డి కి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల వద్ద మంచి పేరు ఉంది అన్నారు. సీఎం సభకు భారీగా తరలిరావాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ,2018లో వెనపల్లి చందర్రావు వాళ్ళనే పార్టీ టికెట్ కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం కూడా మళ్లీ కోదాడ బిఆర్ఎస్ టికెట్ తనదేనని చందర్రావు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఎంతో జరిగిందని పార్టీ వీడనికి మనసు ఒప్పుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ,కేటీఆర్ ల ఆదేశాల మేరకు కోదాడలో బిఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ గెలుపుకు కృషి చేస్తానన్నారు. పార్టీ వీడిన వారిని తిరిగి రావాలని కోరారు. కోదాడ నియోజకవర్గంలో పార్టీని గెలిపించి తన సత్తా చూపిస్తానన్నారు. ప్యాకేజీలకు ఎవరెవరు అమ్ముడుపోయారో బయటపెట్టాలని విమర్శలు గుప్పించే వారిపై ఘాటుగా స్పందించారు. సీఎం సభకు విజయంతో చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజయ్ కుమార్, కాసాని వెంకటేశ్వర్లు, ఏలూరి వెంకటేశ్వరరావు, శీలం సైదులు,పాలడుగు ప్రసాద్,  సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Uttam and Chander Rao set up poker clubs, three-way gambling, liquor syndicates, illegal fish ponds, adulteration and lodge businesses.

Post Midle