Natyam ad

ఉత్తమ్, వెంకట్ రెడ్డిల దారెటు..

.
నల్గొండ ముచ్చట్లు:
 
ఒకప్పుడు కాంగ్రెస్ గా కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ కార్యాచరణను మొదలు పెట్టారా… అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఎంపీ లు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా.. అందుకే ఇద్దరు ఎంపీలు తమ సొంత నియోజక వర్గంలో కొత్తగా క్యాంపు ఆఫీస్ లను ఏర్పాటు చేశారా? అంటే అవునంటున్నారు కాంగ్రెస్ నేతలు.ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. కానీ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాల్లో మునుగోడు మినహా, మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇద్దరు ఎంపీలు నల్గొండలో కొత్తగా క్యాంపు ఆఫీసులు ఓపెన్ చేశారు.2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత నల్గొండ నియోజకవర్గంలో రాజకీయాలకు దూరంగా వున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు నల్గొండలో తన క్యాంపు ఆఫీసు తిరిగి తెరవడం చర్చనీయాంశం అయింది. కోమటిరెడ్డి తన క్యాంపు ఆఫీస్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ గాదె వినోద్ రెడ్డి నివాసంలో రూపుదిద్దుకుంటుంది. జిల్లా లీడర్లకు పార్టీ క్యాడర్ కు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఆఫీస్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెగ్యులర్ గా వస్తున్నారు. నల్గొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతరువాత భువన గిరి ఎంపీ గా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.
 
మూడేళ్ళుగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ కు రాకపోవడం అంటీముట్టనట్లు వ్యవహరించడంతో లోకల్ కేడర్ గందరగోళానికి గురైంది. కేడర్ కు అండగా నిలబడే నాయకత్వం లేక గత మూడేళ్ళుగా నల్గొండ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరగలేదు. ఒకానొక దశలో కొందరు లీడర్స్ తమ దారి తాము చూసుకోవాలని భావించారు.పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని గ్రహించిన ఎంపీ కోమటిరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. పీసీసీ రాకపోవడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా రాజకీయాలకు ఫుల్ టైం కేటాయించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డివెంకట్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే లుగా పోటీ చేయాలని భావిస్తుండటంతో ఇప్పటి నుంచే గెలుపు కోసం కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. తమ సొంత నియోజక వర్గాల్లో మకాం పెట్టడంతో పాటు, తమ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లోను పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి సారించారు. నల్గొండలో క్యాంపు ఆఫీసులే కేంద్రంగా ఇక నుంచి ఇద్దరు ఎంపీలు జిల్లాలో తమ వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు తెలుస్తుంది.నల్గొండ ఎంపీ ఉత్తమ్ ఆఫీస్ లో ఇప్పటికే అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ఇద్దరు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్గొండ జిల్లా జెడ్పి సర్వసభ్య సమావేశానికి హాజరై… అధికారులు కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని.. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పద్ధతులు పాటించాలన్నారు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి.వీలైనప్పుడల్లా తమ పరిధిలోని మండల పరిషత్, మున్సిపల్ మీటింగ్ లకు హాజరవుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ పేరుతో నల్గొండ ఎంపీ ఉత్తమ్ తన అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్ నగర్,కోదాడ తోపాటు నల్గొండ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇక కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భువన గిరి పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూనే నల్గొండకి వస్తున్నారు. నల్గొండ కు రెగ్యులర్ గా వస్తున్న భువన గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో మెడికల్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని పద్మశ్రీ కి 75 వేలు ఆర్థిక సహాయం చేశారు.నల్గొండ పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారి 565 నిర్మాణంలో షాపులు పోయేవారు భయపడకండని, స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎక్కువ మార్కింగ్ చేయిస్తూ షాపు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నల్గొండ పట్టణంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మీ సమస్యలపై కేసీఆర్, కేటిఆర్ లను కలిసి పరిష్కరించేలా చేస్తానన్నారు. నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఏమి చేయలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ కోమటి రెడ్డి. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన శ్రీశైల సొరంగ మార్గం, బ్రహ్మణ వెల్లంలా ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని పటిష్టం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారట ఎంపీ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి. రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని అందుకు అనుగుణంగా ఇద్దరు సీనియర్ నేతలు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. వారి ప్లాన్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
 
Tags:Uttam, Venkat Reddy’s pass ..

Leave A Reply

Your email address will not be published.