Natyam ad

ఈ నెల 28న మహతిలో ఉత్తమ విద్యార్థి అభినందన సభ పోస్టర్ ఆవిష్కరణ

తిరుపతి ముచ్చట్లు:

భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్తమ విద్యార్థి అభినందన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం తిరుపతి మహతి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆ సమితి గౌరవ అధ్యక్షులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ, ఏపీ ప్రైవేటు విద్యాసంస్థల సంఘము రాయలసీమ జోన్ అధ్యక్షులు యశ్వంత్ స్కూల్ అధినేత ఎన్ విశ్వనాథరెడ్డి లు తెలిపారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ప్రధాన ఉత్సవ అభినందన సభ నిర్వహించినట్లు తెలిపారు 95వ అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతిభ కనబరిచిన విద్యార్థులు విచ్చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి ,మదనపల్లి, శ్రీకాళహస్తి పట్టణాల్లో ఇటువంటి అభినందన సభలను తమ సంస్థ నిర్వహించినట్లు తెలిపారు. సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశభక్తి, త్యాగనిరతి , అంకుటిత బావాలో పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన విధానాలను నేటి విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి ప్రతిభ సత్కార సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

 

Post Midle

రాజకీయాలకతీతంగా విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు మందికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్సీ అవార్డులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు ఈ అవార్డులను అనంతపురం జిల్లాకు చెందిన తరిమెల అమర్నాథ్ రెడ్డి విశాఖ నగరానికి చెందిన జర్నలిస్టు వర్మ తిరుపతి మెజారిక్ అడ్వెంచర్ కమ్యూన్ కు చెందిన అన్నదమ్ములు బివి రమణ బాలసుబ్రమణ్యం తిరుపతికి చెందిన అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడు చిరంజీవి మహీం వర్మ లకు అందించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మిమిక్రీ కళాకారుడు డాక్టర్ డి విజయ్ కుమార్, సామాజికవేత్త ఎన్ శివారెడ్డి ,వెంకటరమణారెడ్డి, రవీంద్రారెడ్డి, ఎల్ రమేష్ బాబు నాయుడు, సుబ్రమణ్యం రాజు, షేక్ మహమ్మద్ రఫీ, పెదరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags: Uttam Vidyarthi Abhinandana Sabha poster in Mahathi on 28th of this month
innovation

Post Midle

Leave A Reply

Your email address will not be published.