పుంగనూరులో 24న మంత్రి పెద్దిరెడ్డిచే ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించనున్నారు. బుధవారం రెడ్డి జన సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ శరణ్, త్రిమూర్తిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్‌రోడ్డులో విగ్రహాన్ని పెట్టి రంగులు వేసి, బ్యారీకెడ్లు , విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆసర్కిల్‌కు ఉయ్యాలవాడ సర్కిల్‌గా నామకరణం చేయనున్నారు. పట్టణ ప్రముఖలతో పాటు ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మత సంఘాల నాయకులను కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉయ్యాలవాడ సర్కిల్‌కు రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని సంఘ నాయకులు కోరుతున్నారు.

Tags; uyyalawada-idol-unveiled-by-minister-peddireddy-on-24th-at-punganur
