పుంగనూరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆదర్శప్రాయుడు

పుంగనూరు ముచ్చట్లు:

స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమాజానికి ఆదర్శప్రాయుడని , ఆయన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణమని పలువురు కొనియాడారు. శుక్రవారం రెడ్డి జనసంక్షేమ సంఘ నాయకులు , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, డాక్టర్‌ శరణ్‌, సీఐ రాఘవరెడ్డి ల ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 218వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నాగరాజారెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ బ్రిటిష్‌వారికి ఎదురొడ్డి , ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడన్నారు. పట్టణంలో ఆయన పేరున యుఎన్‌ఆర్‌ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల సహకారంతో కరోనా కాలం నుంచి రెడ్డి సంఘం ఉయ్యాలవాడ పేరున పలు సేవా కార్యక్రమాలు చేపట్టి , కళాకారులకు , విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు జయరామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, త్రిమూర్తిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, లలితమ్మ, బాలచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మహేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Uyyalawada Narasimha Reddy in Punganur is exemplary

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *