ఫ్రెండ్స్ మెగా షోరూమ్‌లో వి-20 మొబైల్స్ విడుదల

– ఆఫర్లతో  మొబైల్స్ వ్యాపారం
– ప్రారంభించిన డాక్టర్‌ శివ, వరదారెడ్డి

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నాగపాళ్యెంలో నూతనంగా ఫ్రెండ్స్ మొబైల్స్ మెగా షోరూమ్‌ను గత నెలలో అధినేత సాధిక్‌ ప్రారంభించారు. మంగళవారం దసరా , దీపావళి పండుగను పురస్కరించుకుని వి-20 నూతన మోడల్‌ మొబైల్స్ మార్కెట్‌లోనికి విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని  లయన్స్బ్ ‌ క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ, జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి కలసి ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సాధిక్‌ మాట్లాడుతూ పండుగలను పురస్కరించుకుని వినియోగదారుల కోరిక మేరకు షోరూమ్‌లో అన్ని రకాల నూతన మొబైల్స్ సరసమైన ధరలకు పండుగ ఆఫర్లతో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అలాగే మొబైల్స్ విక్రయాలపై స్వల్పకాలిక ఇఎంఐలతో తక్కువ వడ్డీ ధరలకు రుణసదుపాయం కల్పించినట్లు తెలిపారు.వినియోగదారులు తమ ఆధార్‌కార్డులు తప్పక తీసుకురావాలని కోరారు.ఈ అవకాశాలను ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మొబైల్‌ షోరూమ్‌లో పొందాలని ఆయన కోరారు.  ఈకార్యక్రమంలో జబి,షోరూమ్ మేనేజర్లు,సిబ్బంది పాల్గొన్నారు.

లోక్​సభ ఎన్నికల వ్యయం ఇకపై రూ.77 లక్షలు

Tags; V-20 Mobiles launched at Friends Mega Showroom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *