Natyam ad

మహోన్నత వ్యక్తి వి.వి.గిరి

కడప ముచ్చట్లు:

 

మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి దేశానికి విశిష్ట సేవలందించారని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ ఎస్ కొనియాడారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా వి.వి గిరి 128 వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ నాడు అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంలో అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో వివి గిరి కీలక పాత్ర పోషించారన్నారు.  క్వీట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారన్నారు. 1946 లో ప్రకాశం పంతులు ప్రభుత్వం లో కార్మిక మంత్రిగా, అనంతరం శ్రీలంక లో భారత హై కమిషనర్ గ పనిచేశారన్నారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూరు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారన్నారు. 1969 లో దేశానికి రాష్ట్రపతిగా ఎంపికయ్యారన్నారు. బ్యాంకుల జాతీయీకరణలో వి.వి.గిరి ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. వి.వి గిరిని స్ఫూర్తిగా తీసుకుని పోలీసు సిబ్బంది విధుల్లో అంకితభావంతో నిర్వర్తించి ప్రజల మన్ననలు ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి మహేష్ కుమార్, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, ఆర్.ఐ లు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, సోమశేఖర్ నాయక్, ఆర్.ఎస్.ఐ లు, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:V.V.Giri is a great person

Post Midle
Post Midle