వైరస్ ను అడ్డుకునే శక్తి వ్యాక్సినేషన్ లో ఉంటుంది-ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణం జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సోమవారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పిల్లలకు ఈరోజు ప్రారంభించామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు వారి ఆరోగ్యమే మన రాష్ట్రానికి రక్ష అన్నారు. కావున ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలని అన్నారు అలాగే ఈ రోజు మన జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు 355 మందికి అలాగే పట్టణంలో 5254 మంది విద్యార్థులకు మూడు రోజుల్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఏ విధమైన భయం లేకుండా నెమ్మదిగా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. రాబోయే 3rd వేవ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ జరుగుతుందని తప్పకుండ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాక్సినేషన్ వేసుకుంటూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Vaccination has the power to prevent the virus – MLA Madhusudan Reddy