వ్యాక్సిన్ ఫుల్… జనాలు నిల్

హైదరాబాద్   ముచ్చట్లు:
హైదరాబాద్ నగరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. అయితే, చంపాపేట్ పరిధిలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ ఉంది. కానీ దానిని ఇవ్వడానికి సీరంజీలు లేవని సిబ్బంది వెల్లడించారు. దీనిపై వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా వద్ద ఒక కమిటీ హాల్‌లో వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో వ్యాక్సిన్ ఉన్న సీరంజీల కొరత ఏర్పడింది. సీరంజీలను బయట నుంచి కొనుగోలు చేసి తీసుకు వస్తేనే వ్యాక్సిన్ ఇస్తామని వైద్య సిబ్బంది వెల్లడించారు.దీంతో సమీపంలోని మెడికల్ దుకాణాలకు జనం ఎగబడ్డారు. 1,500 మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉండగా అందులో కేవలం వెయ్యి మందికి సరిపోయే అన్ని సీరంజీలు మాత్రమే ఇచ్చారని వైద్య సిబ్బంది వాపోయారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోడానికి వచ్చిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ అ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీపీ సందర్శన
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ రోజు అంబర్‌పేట్‌ హాస్పిటల్‌లోని టీకా కేంద్రాన్ని సందర్శించారు. గురువారం ఇక్కడ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అంజనీ కుమార్ అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఇప్పటివరకు 35 పోలీస్ కుటుంబ సభ్యులకు టీకాలు వేసినట్లు ఆ కేంద్రం సభ్యులు సీపీకి వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలీసులు రాత్రనకా పగలనకా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్‌లో పోలీస్ శాఖలో చాలా మంది పోలీసులు కరోనా బారినపడారు. కొంత మంది మృతి చెందారని అన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Vaccine full … people nil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *