తెలంగాణలో వాక్సిన్ జోరు

Date:20/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

ఇటీవల కాలంలో అధికార టీఆర్ఎస్ కు.. విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఇలాంటి వేళలో ఒకరినొకరు విమర్శలు చేసుకోవటం మామూలే. అలా అని మంచి పనులు చేసినా గుర్తించకుండా తిట్ల వర్షం కురిపించుకునే తీరుకు భిన్నంగా.. తెలంగాణ చేసిన మంచిపనుల్ని పొడుగుతున్న వైనం  ఆసక్తికరంగా మారింది.దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ షురూ కావటం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తొలి రోజున 140 కేంద్రాల్లో.. రెండో రోజు 335 కేంద్రాల్లో టీకాలు వేస్తే.. మూడో రోజున ఏకంగా 894 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా వంద టీకాలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం టీకా వేసుకోవటానికి 73673 మంది రిజిస్టర్ చేసుకున్నారు.అందులో 71 శాతం మంది టీకా వేయించుకున్నారు.

 

 

అంటే.. మంగళవారం ఒక్కరోజులోనే 51997 మంది టీకా వేయించుకోవటం గమనార్హం. దేశంలో కర్ణాటక తర్వాత అత్యధిక మందికి టీకాలు వేసింది తెలంగాణలోనే. కోవిడ్ వ్యాక్సినేషన్ ను సమర్థంగా నిర్వహిస్తున్నారంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించటం గమనార్హం. కేవలం మూడు రోజుల్లో 69625 మంది వైద్య సిబ్బందికి టీకాలు ఇవ్వటంపై కేంద్ర ఆరోగ్య శాఖ సంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా టీకా ప్రక్రియ సాగటాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. మంచిని మంచిగా.. చెడును చెడుగా పేర్కొనటం చాలా అవసరం. ఈ విషయంలో కేంద్రం తీరును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: Vaccine prevalent in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *