Natyam ad

వ్యాక్సినే శ్రీరామ రక్ష- ఆరోగ్య ప్రదాత సీఎం జగన్

– విద్యార్థులకు వ్యాక్సినేషన్
– సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
 
రామసముద్రం ముచ్చట్లు:
 
 
ప్రస్తుత కాలంలో వ్యాక్సినే అందరికి శ్రీరామ రక్ష అని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం కెసిపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య ప్రదాతగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రజల మనన్నలు పొందుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమికక్రాన్ విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి నేను ఒక బిడ్డగా ఉంటానని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. గతంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోన వ్యాక్సిన్లు వేసి కరోన మహమ్మరిని నిర్ములించారని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే క్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ప్రతినిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రజారోగ్యంపై శ్రద్ద వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అనంతరం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్న 84 మంది విద్యార్థులకు మంది కోవ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ రాధాకృష్ణ, ఏఎన్ఏం సుగుణమ్మ, డిజిటల్ అసిస్టెంట్ భారతమ్మ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vaccine Srirama Raksha- Health Provider CM Jagan