టీకాలు భద్రం

Date:22/01/2021

పుణే  ముచ్చట్లు:

పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ఘటనతో కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి ప్రక్రియపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టర్మినల్ గేట్ 1 వద్ద ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. భవనం లోపల భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం 10 యంత్రాలతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ప్రాంతం నుంచి మృత దేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ముగ్గురు శాస్త్రవేత్తలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ తయారీ ప్రక్రియ, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని, ప్రమాదం జరిగిన ప్రాంతం తయారీ ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Vaccines are safe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *