టీకాలు శిశువు భవిష్యత్తుకు భరోసా-హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య
చౌడేపల్లి ముచ్చట్లు:
వ్యాధినిరోదక టీకాలు వీటి ప్రాముఖ్యత,అవశ్యకత పై తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన అవసరమని, హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య సూచించారు.పి.హెచ్.సి.తలుపుల ప్రధాన వైద్యాధికారి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు,శనివారం మేల్లచేరువు గ్రామంలో శిశువులకు, నిర్వహిస్తున్న వ్యాధినిరోదక టీకాల కార్యక్రమంలో పాల్గొని కొండయ్య తల్లులకు టీకాల ఆవశ్యకతను గూర్చి వివరించారు.శిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా,ప్రాణాంతక వ్యాధులు సోకకుండా,
వ్యాధినిరోదక టీకాలు ఇప్పించుట ప్రతి తల్లి బాధ్యత తీసుకోవాలని,టీకా ఇచ్చినప్పుడు తేలికపాటి జ్వరం,నొప్పి కొందరిలో సహజమని,ఇది సహజ రక్షణ వ్యవస్థ బలోపితం కావడములో ఒక భాగమని,గుర్తించాలని,శిశు ఆరోగ్య సేవల్లో, రోగ నిరోదకత ప్రధానాంశం కావున టీకాలు నిర్దేశించిన సమయానికి బిడ్డలకు తప్పక వేయించాలని, టీకాలు శిశువు యొక్క జన్మ హక్కు అని,లేనిచో వ్యాధుల నిర్ములనలో ఆశించిన ఫలితాలు.రాకపోగాశిశువులకు,వ్యాదులు,అంగవైకల్యం,మరణాలు సంభవిస్తాయని,కావున ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్య స్వంతం కావాలంటే వ్యాధినిరోదక టీకాలు తప్పక ఇవ్వాలని కొండయ్య తల్లులకు తెలిపారు.కార్యక్రమంలో పర్యవీక్షకులు కృష్ణయ్య,ఏ.యన్.యం.నాగవేణి,ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Vaccines ensure a child’s future-Health Educator Kondaiah
