ఒక్క రోజే 8 లక్షల మందికి టీకాలు

విజయవాడ ముచ్చట్లు :

 

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ రికార్డుపై కన్నేసింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం ఒక్కరేజే 8 ల‌క్షల కరోనా వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్ల క‌లెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందించాలని ప్రభుత్వం సూచించారు. ఇప్పటికే ఒక్క రోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఏపీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయాలని సంకల్పించింది.కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,22,83,479 వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. ఇప్పటివరకు 5,29,000 మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు రెండు సార్లు ఒక్కరోజులో 6 ల‌క్షల కరోనా వాక్సిన్‌ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ‌ అందించింది. ఈ రికార్డులు బద్ధలు కొట్టేలా ఒకేసారి 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు అంతా సిద్ధం చేసింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకా వేసింది.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Vaccines for 8 lakh people in a single day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *