వైకాపా నేత రామశేషు దారుణహత్య
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం గ్రామంలో వైస్ ఎంపిపి రామశేషు దారుణహత్యకు గురయ్యాడు. శ్రీకూర్మంలోని దువ్వుపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు.
శ్రీకూర్మం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న తన గ్యాస్ గోడౌన్ దగ్గరికి సుమారు 6 గంటల ప్రాంతంలో బరాటం రామశేషు హత్య జరిగింది.గ్యాస్ గోడౌన్ లోకి వెళ్లకమునుపే రోడ్డు పై వ్యక్తులు రామశేషు మెడను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు నరికినట్లు సమాచారం. నెంబర్ ప్లేట్ తీసి పల్సర్ బైక్ పై వచ్చి హత్య చేసినట్లు సమీప ప్రజలు చెబుతున్నారు. ముగ్గురు వ్యక్తులలో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా మరో ఇద్దరు పూర్తిగా మొఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని ప్రజలు అంటున్నారు.
Tags; Vaikapa leader Ramasheshu brutally murdered

