జడ్పీ చైర్ పర్సన్ ను సత్కరించిన వైకాపా నేత వినోద్ రెడ్డి,సర్పంచ్ వెంకట రమణమ్మ
-వినోద్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించిన ఆనం దంపతులు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి దంపతులను నెల్లూరు నగరం లోని వారి నివాసంలో గురువారం కోట పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ వినోద్ రెడ్డి,కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ , వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోట గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఛైర్ పర్సన్ అరుణమ్మ ను నిధులు కోరి పలు అంశాలను చర్చించారు.ఈ సందర్భంగా వినోద్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించి గౌరవించారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ,ఆనం విజయ కుమార్ రెడ్డి దంపతులకు వినోద్ రెడ్డి శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దలుజడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఆనం జయకుమార్ రెడ్డి దంపతులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆనం నల్లపరెడ్డి కుటుంబాలకు ఎన్నో ఏళ్ళు నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కోటలో పలు అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడంతో వారు స్పందించి తప్పకుండా అన్నీ విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు. వారి ఆత్మీయత ను ఎన్నటికీ మరువలేము అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట రమణమ్మ, రామకృష్ణ, శేషయ్య,వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vaikapa leader Vinod Reddy and Sarpanch Venkata Ramanamma honored the Zadpi chairperson