విశాఖ తూర్పు లో వైకాపా ప్లీనరీ సన్నాహక కార్యక్రమం

విశాఖపట్నం ముచ్చట్లు:


వైసీపీ అధిష్టానం రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీ సమావేశాలకు నియోజకవర్గాల వారీగా శ్రేణులు సన్నద్దమవుతునారు.వచ్చే నెల 8,9 తేదీలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో ప్లీనరీ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం ప్లీనరీ సమావేశం వుడా చిల్డ్రన్ ధియేటర్ లో ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈసమావేశానికి తూర్పు నియోజకవర్గం నుండి కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో హాజరైన విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి, ప్లీనరీ నిర్వాహకురాలు అక్రమాన్ని విజయనిర్మల మాట్లాడుతూ … ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే 95 శాతం నెరవేర్చాలని,ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొనసాగిస్తున్నారని అన్నారు.

 

Tags: Vaikapa Plenary Preparatory Program in Visakhapatnam East

Post Midle
Post Midle