ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
చౌడేపల్లి ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ మేకలవారిపల్లెలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాల నడుమ హోమ పూజలు చేసి, శాస్తోక్తంగా స్వామివారి విగ్రహం సుముహూర్త కాలంలో పీఠం పై నెలకొల్పి ప్రత్యేక అలంకరణల అనంతరం మహా మంగళహారతి సమర్పించారు.ఈ పూజలలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పిటిసి దామోదర్ రాజు, ఎంపీపీ గాజుల రామ్మూర్తి, సోమల మల్లికార్జున రెడ్డి, ఆనందరెడ్డి, రెడ్డప్ప రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Vaikapa State Secretary Peddireddy in the Anjaneya Swami statue
