వైకాపా ప్రెస్నోట్ చూసి ఆశ్చర్యపోయాం

– రాష్ట్ర ఎన్నికల కమిషన్  నిమ్మగడ్డ

Date:28/10/2020

అమరావతి  ముచ్చట్లు:

అమరావతి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాల కోసం నిర్వహించిన సమావేశంలో 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు.  ప్రభుత్వ అభిప్రాయం కోసం సీఎస్తో ఎన్నికల సంఘం సమావేశం అవుతుందన్నారు.  ‘‘సమావేశానికి హాజరవ్వట్లేదని” వైకాపా నాయకులు చెప్పారు.  ఎస్ఈసీపై వైకాపా నాయకుడి ప్రెస్నోట్ చూసి కమిషన్ ఆశ్చర్యపోతోంది.  కొవిడ్ పరిస్థితులపై నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో గంటపాటు సమావేశం జరిపాం.  సంప్రదింపుల ప్రక్రియ గొప్ప అంశంగా కమిషన్ భావిస్తోంది.  అన్ని విషయాల్లో సీఈసీ ఉత్తమ పద్ధతులను ఎస్ఈసీ అనుసరిస్తోంది.  సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను కమిషన్ గౌరవిస్తోంది అని నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళలదే రాజ్యం

Tags: Vaikapa was shocked to see the press note

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *