బీజేపీతో వైకాపా చెట్టాపట్టాల్ : ఎంపీ టీజీ వెంకటేష్ 

 Date:27/02/2018
కర్నూలు ముచ్చట్లు:
ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని విన్నాం.  ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వైకాపా కానీ  జీఎస్టీ ఏర్పాటుకు, నోట్ల రద్దుకు రాష్ట్రనికి కావలసిన ప్రత్యేక హోదాపై ఎటువంటి షరతులు పెట్టకుండా కేంద్రానికి మద్దతు పలకడం  ఎనిమిదవ  వింత అని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు.  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో  రాష్ట్రనికి  ప్రత్యేకహోదా  అనే డిమాండ్  పెట్టకుండా  ఎలాంటీ షరతులు లేకుడా బీజేపీ అభ్యర్టులకు వైకాపా మద్దతు  ఇవ్వడం తొమ్మిదవ వింత అయన అన్నారు. రాయలసీమకు చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ లన్నీ  తామే తెచ్చామని బీజేపీ  బుజాలు ఎగరేసుకుంటుంది,  రాష్ర్టనికి ప్రత్యేక హోదా కూడా  ఇచ్చి బుజాలు ఎగరేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం  లేదని అయన అన్నారు.  రాజకీయంగా బీజేపీ తో కలసి టీడీపీ, జనసేన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఐనప్పటికీ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు, రాష్ఠ్ర ప్రయోజనాల కొరకు కేంద్రాన్ని  నిలదీయడం, ఎదురించటం  జరిగింది.   ప్రతిపక్షంలో  ఉన్న  వైకాపా  రాష్ఠ్ర ప్రయోజనాలపై బీజేపీ కి డిమాండ్స్ పెట్టకుండా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది.వైకాపా కు  ధైర్యముంటే  బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాలి. వైసీపీ నేతలు అనవసరంగా ప్రజలను మభ్య పెడుతూ బీజేపీ వారి భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నారు.     15 ఏళ్ళుగా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ప్రత్యేక హోదా కొరకు పోరాడి రాష్ఠ్ర విభజన సమయంలో తెరమీదకు తెచ్చి, చంద్రబాబు సహకారంతో సాధించడం జరిగింది. కానీ కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని అయన విమర్శించారు.
Tags: Vaikappa Chettappattal with BJP: MP Tej Venkatesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *