ఆధునిక భారత్ నిర్మాణంలో వాజ్ పేయి కీలక పాత్ర

-అటల్ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి ముచ్చట్లు:


ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు అటల్ బిహారీ వాజపేయి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. . ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయిరి వర్ధంతి సందర్భంగా ఆ భారతరత్న స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.   వాజపేయి  పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం… భాగస్వామి కావడం నాకు ఎంతో  తృప్తిని ఇచ్చే అంశమని పేర్కోన్నారు.దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడు  వాజపేయి అని కోనియాడారు.

 

Tags: Vajpayee played a key role in the construction of modern India

Leave A Reply

Your email address will not be published.