ఎస్టీ జాబితాలో వాల్మీకులను చేర్చాలి

Date:20/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోని వాల్మీకి, బోయ కులస్తులందరని ఎస్టీ జాబితాలో చేర్చేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని విఆర్‌పిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దాలనాగరాజ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన ఈ మేరకు తహశీల్ధార్‌ మాధవరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అద్దాలనాగరాజ మాట్లాడుతూ 13 జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోధావరి, పశ్చిమగోధావరి జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగాను, మిగిలిన ఎనిమిది జిల్లాలో వాల్మీకులు బీసి ఏలుగా ఉన్నారని తెలిపారు. ఒకే కులానికి చెందిన వారిని ఒకే రాష్ట్రంలో రెండు కులాలుగా ఎలా విభజిస్తారని డిమాండు చేయడంతో గత సంవత్సరం డిసెంబర్‌ 2న ప్రభుత్వం అసెంబ్లిలో తీర్మాణం చేస్తూ, ఎస్టీలుగా గుర్తిస్తామని, కేంద్రానికి నివేధికలు పంపుతామని, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. లేకపోతే విఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.రమణప్ప,నారాయణ, రెడ్డెప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ జాబితాలో వాల్మీకులను చేర్చాలిhttps://www.telugumuchatlu.com/valimites-should-be-included-in-the-st-list/

Tags; Valimites should be included in the ST list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *