కాకినాడ జిల్లా పోలీసు కార్యాయలంలో వాల్మీకి జయంతి
కాకినాడ ముచ్చట్లు:
శనివారం నాడు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిపారు. కార్యక్రమానికి హజరయిన జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ రామాయణ కర్త వాల్మీకి స్వగుణ ధర్మముతో బోయవాడిగా పుట్టి మహార్షి గా రూపాంతరం చెందారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్యపీ అడ్మిన్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ సత్యనారాయణ, ఆర్.ఐ. (అడ్మిన్) వి.జి. శ్రీహరి రావు, జిల్లా లోని పోలీసు అధికారులు, సిబ్బంది మహర్షి వాల్మీకీ చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించారు.
Tags: Valmiki Jayanti at Kakinada District Police Office

