పుంగనూరులో వైభవంగా వాల్మీకి జయంతి
పుంగనూరు ముచ్చట్లు:
వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను పట్టణంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు డాక్టర్ పి.శివ, విశ్రాంత డిఎస్పీ సుకుమార్, అద్దాలనాగరాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి హాజరై వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ మాట్లాడుతూ వృత్తిలేని కులంగా ఉన్న బోయులకు రిజర్వేషన్ కల్పించి, ఆదుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి , వాల్మీకులకు అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Tags: Valmiki Jayanti celebrated in Punganur
