Natyam ad

పుంగనూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. వాల్మీకులచే స్థానిక ముడియప్ప సర్కిల్‌లో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి సంఘ నాయకుడు డాక్టర్‌ శివ, సుకుమార్‌బాబు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విషయమై ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో పాటు వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ, గంగరాజు, నరసింహులు, శంకర, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Valmiki Jayanti celebrations in Punganur

Post Midle