Natyam ad

కబ్జా కోరల్లో విలువైన భూములు

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజాంసాగర్‌ భూములు కబ్జా కోరల్లో,పట్టాలవుతున్నా పట్టింపులేదు.ఆప్రాంతంలో ఎకరా విలువ రూ.20 లక్షలపైనే పలుకుతోంది.రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు చోటా నేతలు జలవనరులశాఖ భూములను కబ్జా చేయడం, పట్టాలు చేసుకోవడం అంత చకచక జరుగుతున్న పట్టించుకోని అధికారులు.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్ భూములు కబ్జాకు గురవుతున్నాయి.ఈ భూమి జలవనరుల శాఖకు చెందింది.ఓ చోటా చేత ఆక్రమించుకుని సాగుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా విలువ రూ.20 లక్షలపైనే పలుకుతోంది.నిజాంసాగర్‌ జలాశయం భూములు  ప్రస్తుతం జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్నవి 440.20  ఎకరాల్లో క్వార్టర్లు, కార్యాలయాలు, విద్యా సంస్థలకు కేటాయించింది 121 ఎకరాలు, భు సేకరనచేసింది  2460.34 ఎకరాలు,కాగా మిగిలింది  560 ఎకరాలు,ప్రాజెక్ట్  ను  నిర్మించిన్ అపరాంతం నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ లో నిర్మాణం చేసింది అప్పటి నిజాం ప్రభుత్వం.భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రెండు నెలలుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు భూములను రాత్రికిరాత్రే చదును చేస్తూ ఆక్రమిస్తున్నారు.రాష్ట్రంలో ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఒకటైన నిజాంసాగర్‌ నిర్మాణానికి ఆయా జిల్లాల్లోని 12 గ్రామాల రైతులు సుమారు 2500 ఎకరాలను ఇచ్చారు. నిర్మాణానికి పోగా మిగిలిన 560 ఎకరాలు జలవనరులశాఖ ఆధీనంలోకి ఉంది.

 

 

 

Post Midle

ఇటీవల కాలంలో భూముల ధరలు పెరగడంతో చోటా నేతలు, రెవెన్యూశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది వాటిపై కన్నేశారు. ఇప్పటికే 200 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమయ్యాయి. తాజాగా మరో వందెకరాలు కబ్జాకు గురవుతున్నాయి. పరిరక్షించాల్సిన జలవనరులశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఆ భూములతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఐతే రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు చోటా నేతలు జలవనరులశాఖ భూములను కబ్జా చేయడంతో పాటు పట్టాలు చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి.ఇటీవల ఓ పార్టీ నాయకుడు రెండెకరాల భూమిని సాగు చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో కదిలిన అధికారులు నోటీసులు జారీ చేసారూ.మరోవైపు ప్రాజెక్టు సమీపంలోని భూములను గతంలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీని కోసం సుమారు రూ.184 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వందాలది ఎకరాలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా ఆహారశుద్ధి పరిశ్రమలు తీసుకురావాలని పాలకులు నిర్ణయించారు.ఇందుకు విరుద్ధంగా బృహత్‌ ప్రకృతి వనల ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. అనధికారికంగానే జరుగుతున్న ఈ వ్యవహారంపై సందేహాలు తలెత్తుతున్నాయి. నిబంధనల మేరకు జలవనరులశాఖ భూమిని ఇతర శాఖలకు బదలాయించాలంటే మంత్రివర్గ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.

 

 

మరోవైపు భూములన్నీ నవీకరణకు నోచుకోని దస్త్రాలు,భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా ప్రభుత్వ భూములతో పాటు జలవనరులు, దేవాదాయశాఖకు చెందిన భూములను ఆయా సంస్థల పేరిట పట్టాలు చేయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల డిజిటల్‌ సంతకాలు పూర్తికాకపోవడంతో ప్రాజెక్టు పేరిట బదిలీ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయింది.జలవనరులశాఖ భూములకు హద్దులు నిర్ణయించి కంచెలు ఏర్పాటు చేస్తేనే అన్యాక్రాంతం కాకుండా ఉంటాయి. ప్రధానంగా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రాజెక్టు భూములను సంరక్షించాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.ప్రాజెక్ట్ భూములకు సంబంధించిన అధికారులు మాత్రం జలవనరులశాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం.రెండు రోజుల్లో నిజాంసాగర్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించి హద్దులు పెట్టిస్తాం.ప్రాజెక్టు పేరిట భూముల బదలాయింపు పూర్తి చేసామని,ఇంకా మిగిలి ఉంటే త్వరితగతిన పూర్తి చేస్తాని అధికారులు చెపుతున్నారు. భూములన్నీ కబ్జాలకు గురైన తరువాత అధికారులు స్పందిన్చారం పై సర్వత్ర విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.

 

Tags: Valuable lands in possession

Post Midle