Natyam ad

విలువలతో కూడిన విద్య అవసరం 

పుంగనూరు ముచ్చట్లు:

పిల్లలకు చిన్నతనం నుంచి విలువలతో కూడిన విద్య , నడవడిక అవసరమని వీటిని అలవర్చేందుకు శిక్షణ ఇస్తున్నట్లు శ్రీసత్యసాయి సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని షిరిడిసాయిబాబా జ్ఞానమందిరంలో పిల్లలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆటలు, చిత్రలేఖనం, మైండ్‌గేమ్స్, నీతికథలు , వ్యాయామము, సంగీతము, శ్లోకాలు, భగవత్‌గీత పఠనం, ఓంకార ప్రాధాన్యతలపై ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణకు ఆసక్తి గల విద్యార్థులు 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు లోబడిన వారు చేరవచ్చునని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్‌ ఉపాధ్యాయులు హేమలత, సాయిరోహిత్‌, భారతి, భవనేశ్వరి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Values education is essential

Post Midle