Natyam ad

విలువలు -విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్

నందిగామ ముచ్చట్లు:

పట్టణంలోని 10 వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించారు.  ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమపథకాలను -పనితీరును వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక -ఆదర్శ పాలన సాగిస్తున్నారని , అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విలువను విశ్వసనీయతతోకూడిన పరిపాలన చేస్తున్నారని తెలిపారు, గత ప్రభుత్వాలు చేయని విధంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలను నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు ,ఏ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాయకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు ,ప్రజా సమస్యలను విన్నవించగానేతక్షణమే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు , నందిగామ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు , పట్టణంలోగత మూడు దశాబ్దాలుగా నెలకొన్న పారిశుధ్య సమస్యకు అధికారంలోకి వచ్చిన అంతకాలంలోనే డ్రైన్లు నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు , పట్టణంలో పలు అభివృద్ధి పనులువేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు ,ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి తోడుగా నిలవాలని కోరారు .ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, ఏఈ, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు .

 

Tags: Values – The Chief Minister YS Jagan is running a credible administration

Leave A Reply

Your email address will not be published.