వామ్మో… సైబారాబాద్ టార్గెట్ల కోసం చలాన్ల వాత

హైదరాబాద్ ముచ్చట్లు:
అసలే కరోనా కాలం…  భయపెడుతున్న  ఆస్పత్రి బిల్లులు,,  ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలతో బేజారు అవుతున్న నగరవాసులకు పోలీసులు  చర్యలు  ఆగ్రహం తెప్పిస్తున్నాయి… ఇప్పటికి ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులు  పోలీసులు విధిస్తున్న అడ్డగోలు చలాన్లతో చిర్రెత్తిపోతున్నారు….  రోడ్డెక్కాలంటే జంకాల్సిన దుస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. భాగ్యనగరంలో రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితి. ఎటువైపు నుంచి ట్రాఫిక్‌ పోలీసులు కెమెరా క్లిక్‌ మనిపిస్తారో.. ఎక్కడ చలానా మోతమోగుతుందో అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ వంటి సంక్షోభ సమయంలోనూ భారీగా చలానాలు విధిస్తుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొందరు వాహనదారులకు నిబంధనలపై అవగాహన లేకపోవడంతో ఉల్లంఘనలు, కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యంతో చలానాల లిస్ట్‌ పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నగరంలో చాల చోట్ల  నో పార్కింగ్‌ బోర్డులు కనిపించవు… కానీ అక్కడ పార్కింగ్‌ చేసిన వారికి మాత్రం చలానాలు విధిస్తున్నారు. వన్‌ వే,  నో ఎంట్రీ బోర్డులు కూడా కొన్ని రోడ్లపై కనిపించవు. కొన్ని చోట్ల బోర్డులు ఉన్నా.. ఫుట్‌పాత్‌లు, అక్రమ పార్కింగ్‌లతో అవి కనిపించకుండా పోతున్నాయి. వీటిపై అవగాహన లేకుండా కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల కెమెరాలకు చిక్కుతున్నారు. జరిమానాల రూపంలో వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు.ఇక నగర రోడ్లపై స్పీడ్‌ లిమిట్‌ ఎంతో తెలియజేసే బోర్డులు మచ్చుకు కూడా కానరావు. దీంతో చాలామంది వాహనదారులు వేగంగా వెళ్లి అడ్డంగా బుక్కవుతున్నారు. చలానాలు విధించడంలో ఆసక్తి చూపించే ట్రాఫిక్‌ పోలీసులు, అధికారులు నిబంధనలకు సంబంధించిన బోర్డులు కనిపించేలా, కొత్తవి ఏర్పాటు చేస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందని వాహనదారులు భావిస్తున్నారు.నగరంలో పిలియన్‌ రైడర్లు కూడా తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని నిబంధన విధించారు. అయితే, ఈ విషయంలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదు.చాలా మంది వాహనదారులకు కనీసం ఈ విషయం బోధపడలేదు. దీంతో చాలా మంది పిలియన్లు హెల్మెట్‌ లేకుండా ట్రాఫిక్‌ కెమెరాలకు చిక్కుతున్నారు. అలాగే, గతంలో హెల్మెట్‌ ధరించకుండా రూ.100 చలానా విధించేవారు. కొన్నేళ్లుగా దాన్ని రూ.200కి పెంచారు. ఈ విషయం కూడా చాలామందికి ఇప్పటికీ అవగాహనా లేకపోవడంరో కేమెరాలకు చిక్కుతున్నారు నగరంలో ట్రాఫిక్‌ పెరుగుతున్న కొద్దీ ఉల్లంఘనులూ పెరుగుతున్నారు. నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పనులు, అర్థం కాని రీతిలో కిలోమీటర్ల దూరంలో యూటర్న్‌లు, అడ్డదిడ్డంగా రోడ్లపై తిష్ట వేస్తున్న వాహనాలతో ట్రాఫిక్‌ వ్యవస్థ దెబ్బతింటోంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది త్వరగా వెళ్లాలనే ఆలోచనల్లో తప్పులు చేస్తున్నారు. అతి వేగం, యూటర్న్‌లను తప్పించుకోడానికి రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు.ట్రాఫిక్‌ పోలీసులకు అధికారులు టార్గెట్‌ విధిస్తున్నారు. దీంతో వారు టార్గెట్‌ సాధించేందుకు ఫొటోలు తీసి చలనాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో అక్షర దోషాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో తప్పు చేయకున్నా కొందరికి చలానాలు చేతికందుతున్నాయి. కొన్ని వందల ఫొటోలు తీయాల్సి రావడంతో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతుండవచ్చునని అధికారులు అంటున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Vammo … Challan Vata for Cyberabad targets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *