వనదుర్గామాత ఆలయ హుండీ చోరీ

మెదక్ ముచ్చట్లు:
 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత  ఆలయం గర్భగుడి  లో ఉన్న హుండీని అర్థరాత్రి   గుర్తు తెలియని  వ్యక్తులు  పగుల గొట్టి లక్ష రూపాయల నగదు దొంగిలించారని మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. డిఎస్పీ తెలిపిన వివరాల  ప్రకారం ఉదయం అమ్మవారికి ఆలయ అర్చకులు  అభిషేకం చేయడానికి   శంకర్ శర్మ రావడంతో గర్భ గుడి లో ఉన్నా రెండు హుండీలలో ఒక హుండీ తాళాలు పగులగొట్టి  ఉందని తెలిపారు.. వెంటనే విషయాన్ని ఈవో కు సమాచారం అందించారు ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెదక్ సి ఐ వెంకటయ్య  పాపన్న పేట , కొల్చారం ఎస్సై లు విజయ్ ,శ్రీనివాస్ లు క్లూస్ టీం తో సంఘటన స్థలాన్ని చేరుకొని  పరిశీలించారు.  గర్భగుడి కి ఉన్న కిటికి పగలగొట్టి లోపలికి వచ్చి రెండు హుండీలలో ఒకహుండీ ని పగలగొట్టి లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ సూచన మేరకు హుండీలకు అలెర్ట్ సైరన్ ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ఈవో కు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎడుపాయల ఆలయానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని డిఎస్పీ సైదులు అన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Vanadurgamata Temple hundi theft

Natyam ad