Natyam ad

వనమా రాఘవను అరెస్ట్ చేశాం..అతడి మీద ఇప్పటికే 12 కేసులు ఉన్నాయి

-ఏఎస్పీ రోహిత్
 
భద్రాద్రి –కొత్తగూడెం ముచ్చట్లు:
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి.. ఏఎస్పీ రోహిత్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
పాత పాల్వంచలో 3న జరిగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నాగ రామకృష్ణ, అతడి భార్య వైఫ్ శ్రీలక్ష్మి,  కూతుళ్లు. సాహితి. సాహిత్య. ఈ నలుగురు చనిపోయారు. ఈనెల 3న ఉదయం రామకృష్ణ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి అంటించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద కూతురు సాహిత్య.. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. రామకృష్ణ బావమరిది జనార్ధన్ రావు ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాం. సాహిత్య కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల తర్వాత చనిపోయింది. అక్కడ దొరికిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ ద్వారా వనమ రాఘవ, తన తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వనమామ రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. 3న ఫిర్యాదు రాగానే వెంటనే సీన్ ఆఫ్ క్రైమ్కు వెళ్లి అక్కడున్న సాక్ష్యాలను సేకరించి వెంటనే కోర్టుకు సమర్పించాం. వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. ఏపీ, తెలంగాణలో ప్రత్యేక బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. దీంతో దమ్మపేట మండలంలో మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకున్నాం. వనమామ రాఘవతో పాటు గిరీశ్, మురళి అనే వ్యక్తులను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వనమ రాఘవేంద్రకు చావా శ్రీనివాస్, రమాకాంత్.. అనే మరో ఇద్దరు పారిపోయేందుకు సహకరించారు. వారిపై కూడా 212 సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేశాం. ఈ కేసుతో పాటు మరో 12 కేసులు వనమ రాఘవ మీద ఉన్నాయని ఏఎస్పీ రోహిత్ వెల్లడించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vanama Raghavan has been arrested. There are already 12 cases against him