Vanaparthi Collector Yasmin Bhasha, who became the Collector of Nagar Kurnool District

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వనపర్తి కలెక్టర్  యాస్మిన్ భాషా

Date:29/06/2020

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్కె యస్మీన్ భాషకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు.సోమవారం ఉదయం చార్జ్ ను అప్పగించి కలెక్టర్ బాధ్యతల నుండి ఇ. శ్రీధర్ రిలీవ్ అయ్యారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్కే యాస్మిన్ భాషా గారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజా ఆరోగ్యం, హరితహారం, స్మశాన వాటికల నిర్మాణాలు, డంపింగ్ యాడ్ లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ అప్డేషన్ మరియు తదితర అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. త్వరలోనే జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా తెలిపారు. కలెక్టర్ గా బాధ్యతల సి టి సి పై సంతకాలు చేశారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి

Tags: Vanaparthi Collector Yasmin Bhasha, who became the Collector of Nagar Kurnool District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *