Natyam ad

శవ రాజకీయాల కోసమే విధ్వంసకాండ

– ఉద్దేశపూర్వకంగానే పుంగనూరు, అంగళ్లు అల్లర్లు
– పోలీసులను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే లక్ష్యం
– చట్టం తమను ఏమీ చేయలేదనే టీడీపీ నాయకుల ధీమా
– మదనపల్లె రెండో ఏడీజేకోర్టులో బెయిల్‌ పిటిషన్లపై వాదనలు
– 120 మంది టీడీపీ నాయకుల బెయిల్‌ పిటిషన్లకు పదులసంఖ్యలో లాయర్లు
– శాంతిభద్రతల దృష్ట్యా బెయిల్‌ నిరాకరించాలని కోరిన అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి

 

మదనపల్లె ముచ్చట్లు:

Post Midle

పోలీసులను పరుషపదజాలంతో రెచ్చగొట్టి, ఫైరింగ్‌ చేసేలా ప్రేరేపించి తద్వారా జరిగే కాల్పుల్లో పదుల సంఖ్యలో అమాయక టీడీపీ కార్యకర్తలు చనిపోతే వారి శవాలను తీసుకుని కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పెరేడ్‌ నిర్వహించి రాజకీయంగా లబ్ది పొందేందుకే అంగళ్లు, పుంగనూరుల్లో టీడీపీ నాయకులు విధ్వంసకాండకు వచ్యీహం చేశారని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. గురువారం మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో అంగళ్లు, పుంగనూరు అల్లర్లలో అరెస్ట్ అయిన 120 మంది టీడీపీ నాయకుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిగింది. రాష్ట్రప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి, హైకోర్టు పబ్లిక్‌ ప్రాస్యికూటర్‌ దుష్యంత్‌రెడ్డి, ఏపీపీలు రామకృష్ణ, జనార్ధనరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డిలు తమ వాదనలు వినిపించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 4.30 వరకు నిరాటంకంగా కొనసాగాయి. అడ్వకేట్‌ జనరల్‌ సుధాకరరెడ్డి పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటనల తీరును, పోలీసులపై జరిగిన దాడులు, అల్లరిమూకల అకృత్యాలు, అంగళ్లులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్ట్ ఆయకట్టురైతులను ఉద్దేశించి… నా కొడుకులను చంపండి, కొట్టండంటూ రెచ్చగొట్టిన వీడియోలను న్యాయమూర్తి అబ్రహాంకు చూపించారు. ఆగస్టు 4న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్ధభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ములకలచెరువు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించి అంగళ్లు, మదనపల్లె, పుంగనూరు బైపాస్‌ మీదుగా చిత్తూరు వెళ్లేందుకు డీజీపీ నుంచి అనుమతులు తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్ట్ నిర్మాణంపై చంద్రబాబు ఎన్‌జీటీ కోర్టులో స్టే తీసుకురావడంపై ఆయకట్టు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అంగళ్లులో నిరసన తెలిపేందుకు వచ్చారన్నారు.

 

 

 

వారిని చూసిన మాజీ ముఖ్యమంత్రి కోపంతో సహనం కోల్పోయి నిరసనకారులను కొట్టండి..చంపండంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టినందుకే అల్లర్లు చెలరేగాయన్నారు. అంగళ్లులో వెహోదలైన విధ్వంసకాండ సుమారు 30కిలోమీటర్ల మేర కొనసాగి పుంగనూరులో పరాకాష్టకు చేరుకుందన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ చల్లారామచంద్రారెడ్డి 5,000మంది కార్యకర్తలతో చంద్రబాబును పట్టణంలోకి తీసుకెళ్లేందుకు పచ్చమూకలు పోలీసులపై చొచ్చుకురావడంతో పోలీసులు చంద్రబాబు పర్యటనకు బైపాస్‌ రోడ్డులో మాత్రమే అనుమతులు ఉందని చెప్పడంతో రెచ్చిపోయిన పచ్చమూకలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా రాడ్లు, కర్రలు, కట్టెలు, బీరుబాటిళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరచి, పోలీస్‌ వాహనాలను కాల్చివేసి , ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని ఆయన తెలిపారు. ఆయా ఘటనల్లో ఎస్పీలు రిషాంత్‌రెడ్డి, గంగాధరరావు సంయమనం పాటించి కాల్పులు జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. కాల్పులు జరిగి తెలుగుదేశం కార్యకర్తలు చనిపోతే శవరాజకీయాలు చేయాలన్న లక్ష్యంగా టీడీపీ నాయకులు విధ్వంసరచన చేశారన్నారు. ఘటనలో 47 మంది పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా ఎస్‌ఐ కాలు విరగడంతో పాటుగా కానిస్టేబుల్‌ కన్ను కోల్పోవడం జరిగిందన్నారు.

 

 

 

ఈ దాడులతో సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి, రాష్ట్రపతి పాలన అమలుచేయాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించారన్నారు. కేసు విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉందని, ఇందులో ప్రైవేట్‌ వ్యక్తులు సాక్ష్యులుగా ఉండటం, అరెస్ట్ చేయాల్సిన వారు ఇంకా పరారీలో ఉన్న కారణంగా బెయిల్‌ మంజూరుచేస్తే కేసును ప్రభావితం చేయడమే కాకుండా, సమాజంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. పోలీసులపై దాడులు చేసి చట్టంలోని సెక్షన్‌ 438ను ఉపయోగించుకుని లాయర్ల ద్వారా బెయిల్‌ తీసుకోవచ్చనే ధైర్యం నిందితులకు ఉందని, బెయిల్‌ మంజూరు చేస్తే చట్టం తమను ఏమీ చేయలేదనే సందేశం సమాజంలోకి వెళ్లి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున, అడ్వకేట్‌ జనరల్‌గా కాకుండా ఓ సాధారణ పౌరుడిగా సమాజశ్రేయస్సు, భద్రతను కాంక్షించి బెయిల్‌ నిరాకరించాల్సిందిగా కోరామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అబ్రహాం తీర్పును సోమవారంకు వాయిదా వేశారు.

 

 

అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడ్వకేట్‌ జనరల్‌ సుధాకరరెడ్డి మాట్లాడుతూ..14ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్షనాయకుడిగా పనిచేసిన చంద్రబాబు రాజ్యకాంక్షతో అల్లకల్లోలం చేసి ర్ఖా•న్ని రావణకాష్టంగా మార్చి అధికారంలోకి రావాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి, శాంతిభద్రలకు విఘాతం కలిగించి క్షీణించాయని ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. సమాజంలో ప్రజలను భయపెట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని, చట్టం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్టవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, శివాంజనేయులు, పుంగనూరు ఎస్‌ఐ మోహన్‌కుమార్‌, న్యాయవాది దినేష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:Vandalism is for corpse politics

Post Midle