Natyam ad

విశాఖలో వందే భారత్ సందడి

విశాఖపట్నం ముచ్చట్లు:

ఎంతోకాలంగా చిరకాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్రుల కోరిక నెరవేరింది.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది.. రాత్రి 10.45 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంది ఈ ప్రత్యేక రైలు.. జాతీయ జెండాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు రైల్వే అధికారులు.. వందేభారత్ రైలుపై పూల వర్షం కురిపించారు భారతీయ జనతా పార్టీ నేతులు, కార్యకర్తలు.తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్  పట్టాలెక్కింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు.కాగా, వందేభారత్ రైలులో 16 బోగీలు ఉంటాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జీక్యూ గ్జీ టీవ్ చైర్కార్ బోగీలుంటాయి. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.రైల్ లో ప్రయాణించిన విద్యార్ధులు అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో రూపొందించిన వందే భారత్ రైల్ ప్రత్యేకతలకు మంత్రముగ్దులయ్యారు.రైల్ రాకతో విశాఖ రైల్వే స్టేషన్లో సందడి వాతావరణం నెలకొంది.

 

Tags: Vande Bharat is buzzing in Visakha

Post Midle
Post Midle