వందే భారత్ రైలులో పొగలు
-పోలీసుల అదుపులో పొగ తాగిన వ్యక్తి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు రావ డంతో మనుబోలు రెల్వే స్టేషన్లో దాదాపు గంటసేపు నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు మనుబోలు దగ్గర్లోకి రాగానే పొగలు రావడం మొదలయ్యా యి. సిబ్బంది గుర్తించి వెంటనే లోకో పైలట్కు సమాచారం ఇచ్చారు. రైలు ను స్టేషన్లో నిలపడంతో భయాందో ళనలో ఉన్న ప్రయాణికులు కిందకు దిగేశారు. రైలులో మూడో బోగీలోని బాత్రూమ్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించగా.. అక్కడ కాల్చి పడేసిన సిగరెట్ ముక్క సామ గ్రికి అంటుకోవడం వల్ల పొగలు వచ్చా యని నిర్ధారించారు. ఈ ఘటనకు కారణమైన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags: Vande Bharat train fumes
